: ‘డబుల్’ ఇళ్లకు కావాల్సింది రూ.29 వేల కోట్లు.. బడ్జెట్‌లో కేటాయించింది రూ.500 కోట్లు.. మిగతాది?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని బడ్జెట్ గణాంకాల ద్వారా ప్రభుత్వం చూచాయగా చెప్పింది. ఇప్పటి వరకు సర్కారు కేటాయించిన 2.6 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు 1,426 ఇళ్లను మాత్రమే పూర్తిచేసింది. మరో 16 వేల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటిని పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు కేటాయించిన ఇళ్లు పూర్తిచేయడానికే రూ.29 వేల కోట్లు అవసరముండగా తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. అధికారుల ప్రతిపాదనకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం మరో రూ.27 వేల కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది.