: పిజ్జా డెలివరీ కంటే ముందే వచ్చి తాటతీస్తాం.. యూపీ పోలీసుల వెరైటీ శుభాకాంక్షలు


రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడా ట్వీటుకు లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయి. పోలీసులు చెప్పింది శుభాకాంక్షలు మాత్రమే కాదు.. దాంతోపాటు ఆకతాయిలకు హెచ్చరిక కూడా జారీ చేశారు. యువతులపై వేధింపులకు పాల్పడితే పిజ్జా డెలివరీ కంటే ముందే వచ్చి జైలు వేసి తాటతీస్తామని హెచ్చరించారు. తాగుబోతులు, ఆకతాయిలు అందరూ ఒకే కారులోనే ఉంటారని, ఆ కారుకు డ్రైవర్‌గా మాత్రం పోలీసు అధికారే ఉంటారంటూ యూపీ పోలీస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీటుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువత ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున రీ ట్వీట్ చేస్తోంది.

  • Loading...

More Telugu News