: కాంగ్రెస్ పార్టీ బలం నిరూపించుకోలేని పక్షంలోనే వేరే పార్టీలను పిలవాలి: రఘువీరారెడ్డి


మణిపూర్, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం నిరూపించుకోలేని పక్షంలోనే వేరే పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలవాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, కె.శివాజీతో కలిసి ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఆయా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలవడమనేది కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమని అన్నారు. మణిపూర్, గోవాలో కాంగ్రెస్ కంటే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏ విధంగా చెబుతారని రఘువీరా ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, బేరసారాలతో తమ సంఖ్యా బలం పెంచుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News