: 110 కోట్లకు అమ్ముడు పోయిన 'రోబో 2' శాటిలైట్ ప్రసార హక్కులు


తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడుగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘రోబో 2.0’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ శాటిలైట్‌ ప్రసార హక్కులు రికార్డు ధరకు అమ్ముడు పోయాయి. 2010లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న రోబోకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం భాషల శాటిలైట్ హక్కులు 110 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోవడం వెనుక భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్, కాగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. 

  • Loading...

More Telugu News