: గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు
గుజరాత్ లో భూకంపం సంభవించింది. నేటి మధ్యాహ్నం బనస్కాంత ప్రాంతంలో 3.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ భూకంపంలో సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, 2001లో గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని, చేదు అనుభవాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.