: మళ్లీ పడిపోయిన విరాట్ కోహ్లీ ర్యాంక్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇప్పటివరకు మూడోస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోస్థానాన్ని కోల్పోయి నాలుగుకి దిగజారాడు. ఈ రోజు ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ ఉన్నారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచుల్లో విరాట్‌కోహ్లీ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఇటీవలే రెండో ర్యాంక్ నుంచి మూడో ర్యాంకుకి పడిపోగా ఈ రోజు మూడు నుంచి నాలుగుకి పడిపోయాడు. తొలి టెస్టులో కోహ్లీ 0, 13, పరుగులు చేయగా రెండో టెస్టులో 12, 15 పరుగులు చేశాడు.