: వివాదాస్పద రచయితపై దాడి చేసిన హిందూత్వ మద్దతుదారులు
'దుంది కరణ్యొకనోబ్బ గణపతి యాదే' కథతో కర్ణాటకలో పెను వివాదానికి కారణమైన ప్రముఖ రచయిత, కర్ణాటక కల్చరల్ యాక్టివిస్ట్ యోగేష్ మాస్టర్ పై హిందూత్వ మద్దతుదారులు దాడికి దిగారు. ప్రముఖ పాత్రికేయుడు పి.లంకేష్ 82వ జయంతి ఉత్సవాలకు హాజరైన అనంతరం బాపూజీ డెంటల్ కాలేజీ రోడ్ లోని ఓ టీస్టాల్ ముందు టీ తాగేందుకు ఆయన నిలబడగా, బైక్ లపై వచ్చిన ఆరుగురు యువకులు 'జై శ్రీరామ్' నినాదాలు చేస్తూ ఆయన ముఖానికి నల్లరంగు పూసి, ఆయన షర్టుపై ఇంకుచల్లి, షర్టు చించేసి భౌతిక దాడికి దిగారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఈ దాడి జరగడం విశేషం. దీనిపై జర్నలిస్టులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఆయన దావణగేరె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు.