: ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేకపోయినా... యూపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తాం: వెంకయ్యనాయుడు


యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా ముస్లింలకు బీజేపీ కేటాయించలేదు. దీంతో, యూపీ ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయితే, ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు దగ్గర కావాలని బీజేపీ యోచిస్తోంది. ముస్లింలలో తమకు ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ... ఆ వర్గానికి చెందిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని భావిస్తోంది.

మొన్నటి ఎన్నికల్లో ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా పట్ల ముస్లిం యువత, మహిళలు మొగ్గు చూపారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కొందరు ముస్లింలకు తాము దగ్గరైనట్టు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఇప్పుడు ముస్లిం ఎమ్మెల్యేలు లేకపోయినా పర్వాలేదని... త్వరలోనే వారిని ఎమ్మెల్సీలు చేస్తామని చెప్పారు. యూపీ ప్రభుత్వంలో తప్పకుండా ముస్లింల భాగస్వామ్యం ఉండేలా చేస్తామని తెలిపారు. 

  • Loading...

More Telugu News