: కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ మార్పులు!
ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయినప్పటికీ ఇతరుల సాయంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కి మళ్లీ సీఎం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో పారికర్ ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి రక్షణ శాఖ మంత్రి ఎవరనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
దానితో పాటు కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కనీసం ఒక్కరినైనా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. అయితే, కొత్త రక్షణ శాఖ మంత్రిని నియమించేవరకు ఆ శాఖ అదనపు బాధ్యతలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగియగానే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి.