: అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ షాజాద్ అరుదైన రికార్డు
అఫ్గానిస్థాన్ ఆటగాడు మహ్మద్ షాజాద్ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా అరుదైన రికార్డు సాధించాడు. ఆ ఫార్మాట్లో ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన పరుగులను అధిగమించాడు. నిన్న ఐర్లాండ్‌తో తమ దేశ జట్టుకి జరిగిన టీ20 చివరి మ్యాచ్‌లో డు షాజాద్ 62బంతుల్లో 72పరుగులు సాధించడంతో టీ ట్వంటీల్లో అతడి మొత్తం పరుగులు 1779గా నమోదయ్యాయి. దీంతో 1,709పరుగులతో ఉన్న కోహ్లీని ఐదో స్థానానికి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు ఆయన చేసిన మొత్తం పరుగులు 1707. తాజా మ్యాచ్ తో కలిపి మొత్తం 58మ్యాచ్‌ల ద్వారా షాజాద్ ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే కోహ్లీ ఈ పరుగులని 48 మ్యాచ్‌ల్లో 44ఇన్నింగ్స్‌ల సాధించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో న్యూజిలాండ్ ఆటగాడు మెక్‌కల్లమ్ 2,140 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, దిల్షాన్(శ్రీలంక, 1,889) రెండో స్థానంలో, గప్తిల్(న్యూజిలాండ్, 1,806) మూడోస్థానంలో ఉన్నారు.