: నీళ్లు ఎక్కువగా వాడేస్తున్నాడని విద్యార్థిని చితక్కొట్టి, బూట్లు నాకించే ప్ర‌య‌త్నం చేసిన ఇంటి ఓనర్!


బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓ యువ‌కుడు న‌గ‌రంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, ఆ విద్యార్థి నీరు అధికంగా వాడిన‌ కార‌ణంగా ఆ ఇంటి ఓన‌ర్ అత‌డితో బూట్లు నాకించే ప్ర‌య‌త్నం చేశాడు. అనంత‌రం చిత‌క్కొట్టి గాయాల‌పాలు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై స‌ద‌రు విద్యార్థి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా ఈ రోజు ఈ ఇంటి య‌జ‌మానికి బెయిలు దొరికింది. స‌ద‌రు ఇంటి య‌జ‌మాని పేరు హేమంత్ కుమార్ అని పోలీసులు చెప్పారు. సదరు విద్యార్థి అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువకుడని పోలీసులు తెలిపారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న యువ‌కుడి ప‌ట్ల హేమంత్‌ అమానుషంగా ప్రవర్తించాడని చెప్పారు. త‌న కొడుకు ప‌ట్ల ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ నిందితుడిని శిక్షించాల‌ని బాధితుడి తండ్రి అన్నారు.

  • Loading...

More Telugu News