: 'తెలంగాణ బడ్జెట్' ముఖ్యాంశాలు - 2
ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల ప్రస్తావన లేకుండా, ప్రగతి, నిర్వహణల పేరిట 2017-18 తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ ముందుంచారు. ఆయన ప్రతిపాదనల్లోని మరిన్ని ముఖ్యాంశాలు.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులకు వచ్చే మహిళలకు రూ. 12 వేల సాయం.
* మూడు విడతలుగా రూ. 4 వేల చొప్పున సాయం.
* ఆడపిల్ల పుడితే మరో రూ. 1000 అదనం.
* నవజాత శిశువుకు మూడు నెలలకు సరిపడా కిట్ లు పంపిణీ.
* బేబీ సోప్, ఆయిల్ నుంచి డ్రస్, బెడ్ తదితరాలన్నీ సమకూరుస్తాం.
* 'కేసీఆర్ కిట్' పథకానికి రూ. 605 కోట్లు.
* చేనేత కార్మికుల దుస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
* మహిళా శిసు సంక్షేమానికి రూ. 1,731 కోట్లు.
* ఎంబీసీల అభివృద్ధికి రూ. 1000 కోట్లు.
* మైనారిటీలకు రూ. 1,249 కోట్లు కేటాయింపు.
* బీసీ సంక్షేమానికి రూ. 5,070 కోట్లు.
* పంచాయతీ రాజ్ కు రూ. 14,723 కోట్లు.
* అంగన్ వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా.
* బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు.
* వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,976 కోట్లు.
* ఫీజు రీఎంబర్స్ మెంట్ కు రూ. 1,939 కోట్లు.
* బీసీ విద్యార్థుల కోసం కొత్తగా 119 గురుకుల పాఠశాలలు.
* మైనారిటీల కోసం 201 గురుకులాలు.
* సైనిక సంక్షేమ నిధి ఏర్పాటు.
* సైనిక కుటుంబాలకు డబుల్ పెన్షన్ అవకాశం.
* ఆసరా పింఛన్ కోసం రూ. 5,330 కోట్లు.
* పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు.
* హైదరాబాద్ లో మరో మూడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు.
* కరీంనగర్ లో ఇదే తరహా అత్యాధునిక ఆసుపత్రి.
* మరింత వేగంగా డబుల్ ఇళ్ల నిర్మాణం.
* ఈ ఇళ్లకు బడ్జెటేతర నిధుల్లో అధిక ప్రాధాన్యత.
* మూసీ నది ప్రక్షాళన కోసం రూ. 350 కోట్లు.
* అర్బన్ డెవలప్ మెంట్ కు రూ. 5,599 కోట్లు.
* పెరిగే జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన.
* పట్టణ మౌలిక వసతుల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తాం.
* గడచిన రెండున్నరేళ్లలో 2,776 కి.మీల కొత్త రోడ్లు.
* 7 దశాబ్దాల్లో సాధించిన జాతీయ రహదారులతో పోలిస్తే, టీఆర్ఎస్ వచ్చాక రెట్టింపైన నేషనల్ హైవేలు.
* ప్రస్తుతం రాష్ట్రంలో 5,303 కి.మీ జాతీయ రహదారి.
* ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు రూ. 200 కోట్లు.
* రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ లకు రూ. 400 కోట్లు.
* రాష్ట్రానికి తరలివస్తున్న ఎన్నెన్నో ఐటీ కంపెనీలు.
* 12 శాతానికి చేరిన ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా.
* రూ. 75 వేల కోట్లను దాటిన ఐటీ ఎగుమతుల విలువ.