: 'తెలంగాణ బడ్జెట్' ముఖ్యాంశాలు - 1


ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల ప్రస్తావన లేకుండా, ప్రగతి, నిర్వహణల పేరిట 2017-18 తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ ముందుంచారు. ఆయన ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.
* మొత్తం బడ్జెట్ విలువ రూ. 1,49,446 కోట్లు.
* నిర్వహణా వ్యయం రూ. 61,607 కోట్లు.
* ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు.
* రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
* ప్రజలే కేంద్రంగా పాలన - వారే మాకు ప్రభువులు.
* గత సంవత్సరం 19.61 శాతం వృద్ధి రేటును సాధించాం.
* జాతీయ జీడీపీని మించిన వృద్ధి సాధించడం గర్వకారణం.
* ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు.
* ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో కృషి.
* నోట్ల రద్దు తరువాత కూడా రెండంకెల వృద్ధి.
* ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు.
* ఎస్టీల అభివృద్ధికి రూ. 8,125 కోట్లు.
* ఈ ఏడాదితో రైతు రుణమాఫీ పూర్తి.
* రుణమాఫీకి రూ. 4 వేల కోట్ల కేటాయింపు.
* వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 46,946 కోట్లు.
* వ్యవసాయ రంగానికి రూ. 5,942.97 కోట్లు.
* హరిత వనానికి రూ. 50 కోట్లు.
* పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు.
* విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు.
* ఐటీ రంగానికి రూ. 252 కోట్లు.
* సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్లు.
* శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు.
* పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ. 198 కోట్లు.
* మిషన్ భగీరథకు రూ. 3 వేల కోట్లు.
* జర్నలిస్టులకు రూ. 30 కోట్లు.
* జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు.
* రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు.
* గ్రామీణ వృత్తులకు మరింత చేయూత.
* వచ్చే రెండేళ్లలో 4 లక్షల మంది యాదవులకు 84 లక్షల గొర్రెల పంపిణీ.
* 75 శాతం రాయితీతో గొర్రెల పంపిణీ.
* చేపల పెంపకం, రిటైల్ మార్కెట్లకు మరింత ప్రోత్సాహం.
* నాయీ బ్రాహ్మణులకు రూ. 500 కోట్లు.
* రజకులకు రూ. 500 కోట్లు.
* కుల వృత్తుల వారికి చేయూతనిచ్చేందుకు ఆర్థిక సహకారం.
* గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు.
* పాఠశాల విద్యకు రూ. 12,705 కోట్లు.
* చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 1,200 కోట్లు.
* కల్యాణ లక్ష్మి పథకానికి మరిన్ని నిధులు.
* ఇకపై పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 75,116
* కల్యాణలక్ష్మితో పాటు షాదీ ముబారక్ పథకానికీ పెరిగిన సాయం.

  • Loading...

More Telugu News