: లైంగిక వేధింపులకు పాల్పడ్డ కన్నడ సినీ నిర్మాత.. తోలు తీసిన బంధువులు


సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానంటూ ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్న ఓ కన్నడ సినీ నిర్మాత వీపు విమానం మోత మోగించారు ఆమె బంధువులు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, 'ప్రీతి మాయ హుషారు' అనే సినిమాను నిర్మించిన వీరేష్ కార్యాలయంలో ఓ యువతి పని చేస్తోంది. హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానంటూ ఆమెను వీరేష్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. తనకు పెద్ద నిర్మాతలతో కూడా పరిచయం ఉందని.. తనకు సహకరిస్తే హీరోయిన్ ను చేస్తానని ప్రతి రోజు వేధించేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేక పోయిన ఆమె... తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఉన్న వీరేష్ ఇంటికి వచ్చి... అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News