: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భూమి కంపించింది. అద్దంకి, కొరిశపాడు మండలాల్లో వేకువజామున 2.43 గంటలకు పది సెకన్లపాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప ప్రకంపనలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదు.