: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి స్వల్ప గాయాలు !
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వల్పంగా గాయపడ్డారు. హరిద్వార్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో జైట్లీ తూలిపడటంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. వెంటనే, స్పందించిన అధికారులు, ఆయన ముఖంపై నీళ్లు చల్లి పైకి లేపారు. అనంతరం, హెలికాప్టర్ లో ఆయన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జైట్లీ క్షేమంగానే ఉన్నారని, ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. కాగా, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన సత్తా చాటుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించేందుకు జైట్లీ హరిద్వార్ వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి ఢిల్లీకి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.