: ఈ రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం


రేపు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరుకానున్నారు. రేపు ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్ కు ఆమోదముద్ర వేయడంతో పాటు, నిన్నటి నుంచి అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన చర్చించనున్నారు.

టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్యలను బడ్జెట్ సెషన్స్ కు హాజరు కాకుండా అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎంఐఎం మినహా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు సభ నుంచి నిన్న వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మినహా మిగిలిన మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గుండెపోటుతో మృతి చెందిన టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున కడియం శ్రీహరి నంద్యాల వెళ్లారు. 

  • Loading...

More Telugu News