: సుక్మా దాడితో నిలిచిపోయిన రాజ్ నాథ్ సింగ్ పుట్టినరోజు
కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన పుట్టిన రోజును జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నిన్న మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లపై పాల్పడిన దాడిలో 12 మంది జవాన్లు మృతి చెందారు. రాయిపూర్ లోని నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించిన అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఒక్కో కుటుంబానికి రూ.కోటికి తక్కువ కాకుండా పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. జనాన్ల త్యాగాన్ని వృధాగా పోనీయరాదని, మావోయిస్టులకు గట్టిగా బదులు ఇవ్వాల్సిందేనన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రిస్తామని చెప్పారు.