: యూపీలో 24కు పడిపోయిన ముస్లిం స్థానాలు


దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో... 19 శాతం ముస్లిం జనాభా ఉన్న ఆ రాష్ట్రంలో... ఈ సారి ఆ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత అసెంబ్లీలో ముస్లింలకు 69 స్థానాలు ఉండగా, తాజా ఎన్నికల తర్వాత వారి సంఖ్య 24కు తగ్గింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు గాను బీజేపీ కూటమి 324 స్థానాలు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముస్లింల జనాభా ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికీ సీటు ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయినప్పటికీ ముస్లింల ఓట్లు ఐక్యంగా లేకపోవడం కలసి వచ్చింది. ఇవి ఎస్పీ, బీఎస్పీ మధ్య చీలిపోయాయి. దీంతో బీజేపీకి మార్గం సానుకూలమైంది. అదే సమయంలో హిందువుల ఓట్లను సంఘటితంగా తనవైపునకు తిప్పుకోవడం ద్వారా కాషాయ పార్టీ తన గెలుపును సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News