: హైదరాబాదు నుంచి నంద్యాల బయల్దేరిన నారా లోకేష్!
భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. మూడోసారి ఆయనకు గుండెపోటు రావడానికి తోడు చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీ ఎత్తున ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యశాఖా మంత్రి కామినేని, కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ హైదరాబాదు నుంచి నంద్యాల బయల్దేరి వెళ్లారు. భూమా కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పనున్నారు.