: దుస్తులు దానం చేస్తున్న బాహుబలి
‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ సినిమాతో బిజీగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది. 'బాహుబలి 2' సినిమా ఏప్రిల్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం ప్రభాస్ సుమారు 20 కిలోల బరువు పెరిగాడు. దీంతో అతని వద్ద ఉన్న డ్రెస్సులేవీ అతనికి సరిపోవడం లేదట.
ఈ నేపథ్యంలో సినిమా విడుదలయ్యాక తనకు నిరుపయోగంగా మారిన దుస్తులను దానం చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. గతంలో 'బాహుబలి-ది బిగినింగ్' సమయంలో కూడా బరువు పెరిగిన 'బాహుబలి' తనకు సరిపోని బట్టలను ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో పేదలకు అందించాడట. ‘బాహుబలి- ది కన్‌క్లూజన్’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాగానే తన బట్టలను మరోసారి ఆ స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నట్టు తెలుస్తోంది.