: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు...హుటాహుటీన ఆసుపత్రికి తరలించిన స్థానికులు
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఆళ్లగడ్డలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడుతుండగా హఠాత్తుగా ఆయన కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన అనుచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు తీవ్రమైనది కావడంతో ఆళ్లగడ్డ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, అక్కడి నుంచి నంద్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అహోబిలంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. తన తండ్రికి గుండెపోటు వార్త తెలియడంతో ఆమె హుటాహుటీన నంద్యాల బయల్దేరారు.