: హోరెత్తిన హోలీ సంబరాలు... తెలుగు రాష్ట్రాలు రంగుల మయం!


తెలుగు రాష్ట్రాలు రంగులమయమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో హోలీ సంబరాలు జోరందుకున్నాయి. హైదరాబాదులోని రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించి రంగుల పండుగ జరుపుకున్నారు. డీజేయింగ్, రెయిన్ డాన్స్ లతో వేడుకను హోరెత్తించారు. ఈ సందర్భంగా తాము ఆర్గానిక్ రంగులను వాడుతున్నామని, ఇతరులు కూడా అలాంటి ఆరోగ్యకరమైన రంగులనే వాడాలని పిలుపునిచ్చారు. హోలీని పురస్కరించుకుని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హర్షం వ్యక్తం చేశారు. హోలీ పండగలో పలువురు విదేశీయులు కూడా పాల్గొనడం విశేషం. 

  • Loading...

More Telugu News