: నేను గుజరాత్ వాడిని.. ఢిల్లీలో నా మాట ఎవరు వింటారు..?: వెలుగులోకి వచ్చిన ప్రధాని గత వ్యాఖ్యలు


2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యనేతతో మోదీ అన్న మాటలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో మోదీని కలిసిన ఆ నేత లోక్‌సభలో ఆ బిల్లును అడ్డుకోవాలంటూ సుష్మాస్వరాజ్‌కు, రాజ్యసభలో అరుణ్‌జైట్లీకి చెప్పాలని కోరారట. దీనికి స్పందించిన మోదీ.. తాను గుజరాత్ వాడినని, తన మాట ఢిల్లీలో వినేవారు ఎవరూ లేరని పేర్కొన్నారట. అంతేకాదు, తనను ఢిల్లీకి రాకుండా చేయాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పారట. సుష్మా అయితే తనతో ఫోన్‌లో కూడా మాట్లాడరని, ఏమైనా మాట్లాడేది ఉంటే ఢిల్లీ రమ్మంటారని, తనకు అంత అవసరమా? అని సదరు నేతతో చెప్పారట. అయితే తాను కనుక ప్రధానిని అయితే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం తప్పకుండా న్యాయం చేస్తానని మాత్రం చెప్పగలనని హామీ ఇచ్చారట. ఇప్పుడీ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.
 
ఇక ప్రధాని అయిన తర్వాత ఢిల్లీ నేతలపై తనకున్న కోపాన్ని మోదీ ఏనాడూ దాచుకోలేదు. సుష్మాస్వరాజ్‌కు విదేశాంగశాఖ కట్టబెట్టారు కానీ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గం నిజానికి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీది. అక్కడి నుంచి మోదీ బరిలోకి దిగుతానన్నప్పుడు జోషి వ్యతిరేకించారు. దీంతో మోదీ ప్రధాని అయ్యాక ఆయనను దూరం పెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు అడ్డుపడిన సీనియర్లందరినీ మోదీ పక్కన పెట్టారు. ఇక తాజా విజయాలతో సీనియర్లు ఇక చెప్పించుకోకుండానే తట్టాబుట్ట సర్దుకుంటారని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News