: ఐపీఎల్ లో నేటి వినోదం


ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. 'చైన్నై సూపర్ కింగ్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్' జట్లు తలపడనున్నాయి. 4 గంటలకు మొదలవనున్న ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరుగుతుంది. అనంతరం 8 గంటలకు పుణె వేదికగా 'పుణె వారియర్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్' జట్లు తలపడతాయి. కాగా, నిన్న రాత్రి 'ఢిల్లీ డేర్ డెవిల్స్-కోల్ కతా నైట్ రైడర్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో డెవిల్స్ జట్టు విజయం సాధించింది. వార్మర్, ఉన్ముక్త్ చంద్ రాణించడంతో ఢిల్లీ గట్టెక్కింది. అయినా పాయింట్ల పట్టికలో కోల్ కతా తర్వాతే ఢిల్లీ నిలిచింది.

  • Loading...

More Telugu News