: ‘బీకాంలో ఫిజిక్స్’పై బాబు ఆరా.. తడుముకుంటూ సమాధానం చెప్పిన జలీల్ ఖాన్!


‘బీకాంలో ఫిజిక్స్’.. తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా వైరల్ అవుతున్న పదం ఇది. టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓ వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్స్ చదివినట్టు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ‘బీకాంలో ఫిజిక్స్’ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై ఆరా తీసినట్టు తెలిసింది. శనివారం కృష్ణా జిల్లా నేతలతో ముఖ్యమంత్రి నిర్వహించిన భేటీలో ‘బీకాంలో ఫిజిక్స్’ ప్రస్తావన రాగానే చంద్రబాబు సహా నేతలంతా ఒక్కసారిగా నవ్వేశారు. ‘ఫిజిక్స్’పై చంద్రబాబు ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ను వివరణ అడిగితే, తానొకటి చెబితే మీడియా ఒకటి రాసిందని తడుముకుంటూ చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News