: నాకు తెలిసి రాముడి కంటే మోదీయే గొప్పవాడు!: రాంగోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్
ఏదో ఒక ట్వీట్ చేయడం.. తద్వారా వివాదం రేపడం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిత్యకృత్యం అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ట్వీట్ తో రేపిన కలకలం ఇంకా సద్దుమణగకముందే మరోసారి వివాదాస్పద ట్వీట్ తో రాంగోపాల్ వర్మ దర్శనమిచ్చాడు. నిన్న వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వర్మ స్పందిస్తూ... 'నా ఉద్దేశంలో శ్రీరాముడి కన్నా నరేంద్ర మోదీనే పెద్ద దేవుడు. నాటి (పురాణాల్లో చెప్పే) రామరాజ్యాన్ని నేను చూడలేదు. నరేంద్ర మోదీ ఏలికలోని అయోధ్య రాజ్యంలో ఉండటాన్ని ఇష్టపడుతున్నా' అన్నాడు. పనిలో పనిగా మోదీ సర్కార్ కంటే తాను సీనియర్ బచ్చన్ తో తీసిన సర్కారే బాగుంటుందని కూడా పేర్కొన్నాడు.