: రేడియోలో క్రికెట్ కామెంటరీ పునరుద్ధరణ యోచన!
టీమిండియా క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుండగా రేడియోలో కామెంటరీ విని ఎన్నో ఏళ్లు అవుతోంది. అయితే, మళ్లీ రేడియో కామెంటరీని పునరుద్ధరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన బీసీసీఐ భేటీలో రేడియో కామెంటరీపై చర్చించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దానిపై ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని చెప్పాయి. ఈ అంశంపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నాయి. చివరిసారిగా 2012-13 సీజన్ లో టీమిండియా, భారత్‌ల మధ్య జరిగిన మ్యాచుల సందర్భంలో క్రికెట్ ప్రేమికులు రేడియో కామెంటరీ విన్నారు.