: పంజాబ్ లో ముగిసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. కాంగ్రెస్ విజయ దుందుభి
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా పంజాబ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా 59 మ్యాజిక్ ఫిగర్. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందగా, అకాలీదళ్-బీజేపీ కూటమి 18 సీట్లు గెలుచుకుంది. ఇక ఆప్ 20, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. పాటియాల నియోజక వర్గం నుంచి 51 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.