: బీజేపీ ఘనవిజయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. తమకు యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని అన్నారు. బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం.. తాము అందిస్తోన్న సుపరిపాలనకు చిహ్నం అని అన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ అంకిత భావంతో పనిచేస్తుందని హామీ ఇస్తున్నానని అన్నారు. బీజేపీ పట్ల ప్రజలు కొనసాగిస్తోన్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తామని అన్నారు.