: ప్రజలు తాట తీస్తారన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచుకోవాలి: రోజా
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. తన తోడేళ్లను కాపాడుకోవడానికి... ఆడవాళ్ల మాన ప్రాణాలను సైతం చంద్రబాబు పణంగా పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తే జనాలు తాట తీస్తారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. దళిత మంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు మహిళలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. కేబినెట్లో పేరుకే మహిళా మంత్రులు ఉన్నారని... వారికి ఎలాంటి అధికారాలు లేవని విమర్శించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో డ్వాక్రా మహిళలకు, మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.