: దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిన మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: ఘోర ఓటమిపై మాయావతి
ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఘోర ఓటమి దిశగా పయనిస్తుండడంతో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి పలు ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఓటింగ్ మిషన్ల మాయాజాలమని అన్నారు. తమ ఓట్లన్నీ బీజేపీకే పడేలా ఈవీఎంలను తయారు చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దమ్ముంటే బ్యాలెట్ పద్ధతిన మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. ముస్లిం ప్రాంతాల్లో బీజేపీ ఎలా గెలిచిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యానికి ముప్పని ఆమె వ్యాఖ్యానించారు.