: లంబిలో ఓడి, పాటియాలాలో నెగ్గిన అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అమరీందర్ సింగ్ మిశ్రమ ఫలితాన్ని పొందారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఆయన పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి గెలుపొంది, లంబి స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. లంబి నియోజకవర్గంలో అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ విజయం సాధించారు. మరోవైపు పంజాబ్ లో పూర్తి మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. రేపు ఆ పార్టీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరీందర్ సింగ్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది.