: ఎట్టకేలకు బాహుబలి-2 ట్రైలర్ వచ్చేస్తోంది!
‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ సినిమా ట్రైలర్ విడుదల తేదీని చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అన్ని ఇబ్బందులను తొలగించుకొని రాజమౌళి ఎట్టకేలకు ఆ ట్రైలర్ విడుదల తేదీని చెప్పేశారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ ఈ రోజు తెలిపింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ ఆ రోజు ఉదయం 9గం. నుంచి 10గం. మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదే రోజు సోషల్ మీడియాలోనూ సాయంత్రం 5గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ రెండున్నర నిమిషాల నిడివి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా నటించారు. రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.