: కేవలం 92 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి హరీశ్‌రావత్ హరిద్వార్ (రూరల్), కిచ్చా నియోజకవర్గాల నుంచి ఓటమిపాలయిన విషయం తెలిసిందే. ఆయన కిచ్చా నియోజకవర్గం నుంచి కేవలం 92 ఓట్ల తేడాతో ఓడిపోవడం గమనార్హం. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు పంజాబ్‌లో 75 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. గోవాలో బీజేపీ 12, కాంగ్రెస్ 12 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో గోవాలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.