: కేసీఆర్ స్వీయ సర్వేలో కేటీఆర్ కూ తగ్గిన ప్రజాదరణ... పలువురు మంత్రుల గ్రాఫ్ డౌన్


తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సీఎం కేసీఆర్ స్వయంగా నిర్వహింపజేసిన సర్వేలో, ఆయన కుమారుడు, ఐటీ, మునిసిపల్ మంత్రి, కేటీఆర్ కు కూడా ప్రజాదరణ తగ్గినట్టు వెల్లడైంది. గత సర్వేలో 70.6 శాతంగా ఉన్న కేటీఆర్ పై ప్రజాదరణ ఇప్పుడు 60.4 శాతానికి దిగజారింది. ఇదే సమయంలో గడచిన ఆరు నెలల వ్యవధిలో పలువురు మంత్రుల గ్రాఫ్ కూడా తగ్గింది. తొలి సర్వేలో 80.4 శాతం ఆదరణ చూరగొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మలి సర్వేలో 57.5 శాతం ఆదరణ ఉన్నట్టు తేలింది.

 ఇతర మంత్రులకు ప్రజాదరణ గ్రాఫ్ లలో జగదీశ్ రెడ్డి 94.3 శాతం నుంచి 45.4 శాతానికి, జోగు రామన్న 67.5 శాతం నుంచి 39.9 శాతానికి, చందూలాల్ 82.4 శాతం నుంచి 34.4 శాతానికి, పట్నం మహేందర్ రెడ్డి 68.5 శాతం నుంచి 38.3 శాతానికి, ఇంద్రకరణ్ రెడ్డి 96 శాతం నుంచి 58.4 శాతానికి, తుమ్మల నాగేశ్వరరావు 82.1 శాతం నుంచి 57.5 శాతానికి, జూపల్లి కృష్ణారావు 62.5 శాతం నుంచి 55.2 శాతానికి పడిపోయింది. ఈ సర్వే టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుండగా, తదుపరి సర్వే నాటికి ప్రజాదరణను పెంచుకోకుంటే, 2019 ఎన్నికల్లో టికెట్లను ఇవ్వబోమని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News