: అమెరికాను వణికిస్తున్న తుపాను.. రెండు లక్షల ఇళ్లకు కరెంట్ బంద్
తుపాను ధాటికి అమెరికా విలవిల్లాడుతోంది. బలంగా వీస్తున్న సముద్ర గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కుప్పకూలాయి. దీంతో రెండు లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ న్యూయార్క్ నగరం పూర్తిగా అంధకారంలో చిక్కుకుంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. సముద్రపు అలలు 14 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతుండడంతో తీరప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.