: నిరాశ పరిచిన సైనా, సింధు... ఆల్ ఇంగ్లండ్ నుంచి ఇంటికి
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత ప్రయాణం ముగిసింది. ఇండియా తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న తెలుగు తేజం పీవీ సింధు, సైనా నెహ్వాల్ లు క్వార్టర్ ఫైనల్స్ లోనే వెనుదిరిగారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్ నెగ్గితే, సెమీస్ లో వీరి మధ్యే పోటీ జరుగుతుందని తెలుసుకున్న అభిమానులు అత్యంత ఆసక్తిగా ఈ పోటీల కోసం ఎదురు చూడగా, సింధు ఆశలపై ప్రపంచ నెంబర్ వన్, చైనీస్ తైపీకి చెందిన తై జు యింగ్ నీళ్లు చల్లగా, సైనా నెహ్వాల్ ను వరల్డ్ థర్డ్ ర్యాంకర్, కొరియాకు చెందిన సుంగ్ జి హ్యున్ ఓడించింది. నిన్న రాత్రి ఈ పోటీలు జరుగగా, ఇద్దరూ అనవసర తప్పిదాలతో మ్యాచ్ లను చేజార్చుకున్నారు. సింధు 14-21, 10-21తో ఓడిపోగా, సైనా మాత్రం గెలిచే అవకాశాల్ని చేజేతులా వదులుకుందన్నట్టు 20-22, 20-22 తేడాతో ఓటమి పాలైంది.