: ఐదు రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని గులాం నబీ జోస్యం!


ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నిన్న వెలువడిన ఎగ్జిట్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ -ఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఒకవేళ, ఓటమి పాలైతే  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఎన్నికలు ఎప్పుడూ వ్యక్తులకు రెఫరెండం కాబోవని చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News