: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మెగా’ కుటుంబసభ్యులు
తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు ఈ రోజు దర్శించుకున్నారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, చెల్లెళ్లు విజయదుర్గ, మాధవి కలసి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, మొక్కులు తీర్చుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ వారికి ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదాలు అందజేశారు.