: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీకి ఆయనకు తెలియకుండానే టీడీపీ సభ్యత్వం ఇచ్చారు: వెల్లంపల్లి శ్రీనివాస్


వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీకి తెలియకుండానే ఆయనకు టీడీపీ సభ్యత్వం ఇచ్చారని ఆ పార్టీకి చెందిన విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలన్నీ బోగస్సేనని, తమ పార్టీ కార్యకర్తలకు తెలియకుండానే వారి పేర్లతో టీడీపీ సభ్యత్వ కార్డులు సృష్టించారని, ఈ విషయమై తమ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఓటర్ల జాబితాలోని పేర్లతో బోగస్ కార్డులు సృష్టించి 70 లక్షల సభ్యత్వాలు చేసినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారని, తప్పుడు సభ్యత్వాలపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News