: కశ్మీర్ సమస్యపై ఐరాస చొరవ.. భారత్, పాక్ లతో సంప్రదింపులు!
కశ్మీర్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఉప అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కశ్మీర్ లో పరిస్థితులపై భారత్, పాకిస్తాన్ లతో సంప్రదింపులు జరపాలని ఐక్యరాజ్యసమతి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భావిస్తున్నారని... ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు గల అవకాశాల గురించి గుటెరస్ చర్చలు జరుపుతారని తెలిపారు. కాశ్మీర్ లో సుదీర్ఘ కాలం నుంచి అనేక సంక్లిష్ట సమస్యలు ఉన్నాయని.. వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు తాము చేయగలిగినదేమిటో పరిశీలించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా పర్హాన్ హక్ తెలిపారు.