: కేసీఆర్ ను కలిసిన టీడీపీ నేత మోత్కుపల్లి.. కుమార్తె వివాహానికి ఆహ్వానం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈ రోజు కలిశారు. తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కేసీఆర్ ను మోత్కుపల్లి ఆహ్వానించారు. అయితే, అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడే మోత్కుపల్లి ఆయనను కలవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆర్ ను మోత్కుపల్లి ఎందుకు కలిశారా అంటూ అక్కడున్న వారంతా ఉత్కంఠకు లోనయ్యారు. తీరా విషయం తెలిసేసరికి... 'ఎంతైనా ఇద్దరూ పాత మిత్రులే కదా' అంటూ నవ్వుతూ అనుకోవడం కనిపించింది.