: చంద్రబాబు, హరికృష్ణ మధ్య విభేదాల్లేవు: కల్యాణ్ రామ్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తన తండ్రి హరికృష్ణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నటుడు కల్యాణ్ రామ్ అన్నారు. అదంతా మీడియా సృష్టేనన్నారు. ప్రతిచిన్న విషయాన్ని కూడా మీడియా పెద్దదిగా చేసి చూపిస్తుందని కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కూడా ఎవరితోనూ విభేదాలు లేవన్న కల్యాణ్ రామ్ తాను అందరి మంచి కోరే వ్యక్తినన్నారు. బాబు వెన్నంటే ఉండి పార్టీకోసం సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్ రామ్.. అనంతరం మీడియాతో పైవిధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News