: నా ఎన్నిక విషయంలో పార్టీ నియమాలను ఉల్లంఘించలేదు: శశికళ


అన్నాడీఎంకే పార్టీ నియమాలను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని, పార్టీ నిబంధనల ప్రకారమే తాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యానని శశికళ కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీ)కి వివరణ ఇచ్చారు. జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉండే హక్కు లేదంటూ... ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఈసీని ఆశ్రయించారు. ఈ విషయంపై ఈసీ శశికళకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి శశికళ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News