: యూఎస్ లోని తమ ఉద్యోగులకు విప్రో, కాగ్నిజంట్ హెచ్చరికలు


అమెరికాలో జరుగుతున్న జాతి విద్వేష నేరాలపై ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. టెక్సాస్ పరిధిలోని హూస్టన్ లో విప్రో ఉద్యోగి సుదీప్తా ఇంటిపై దాడి జరిగిన తరువాత, విప్రో సంస్థ ఉద్యోగులు తగు జాగ్రత్తల్లో ఉండాలని, ముఖ్యంగా సున్నిత ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని సూచించింది. ఈ మేరకు ఆన్ సైట్ ఉద్యోగులంతా, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని కోరుతూ, ఈ-మెయిల్స్ పంపింది. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కూడా ఇదే విధమైన లేఖలను ఉద్యోగులకు పంపుతూ, సురక్షిత ప్రాంతాల్లోనే సంచరించాలని సూచించింది. కాగా, ప్రస్తుతం అమెరికాలో దాదాపు లక్ష మంది భారత ఇంజనీర్లు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు.

ఇటీవలి కూచిభొట్ల శ్రీనివాస్ హత్య, ఆపై రోజుల తరువాత హర్నీష్ పటేల్ పై దాడి, భారతీయుడి ఇంటిపై కోడి గుడ్లు, కుక్కల అశుద్ధంతో దాడి ఘటనల తరువాత సుదీప్తా ఇంటిపైనా దాడి జరిగింది. తన ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చేసరికి కొందరు గుర్తు తెలియని దుండగులు బాధితుడి ఇంట్లోకి చొరబడి వస్తువులను నాశనం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, సలహాలు, సూచనలు ఇస్తున్నాయి.

  • Loading...

More Telugu News