: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన మిస్బా


పాకిస్థాన్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సత్తా చాటాడు. హాంకాంగ్ లో జరుగుతున్న డీటీసీ టీ20 బ్లిట్జ్ టోర్నీలో నిన్న హాంగ్ హమ్ జేడీ జాగ్వార్స్ - హెచ్ కేఐ యూనైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హెచ్ కేఐ యునైటెడ్ ఆటగాడైన మిస్బా వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. జాగ్వార్స్ ఆటగాడు ఇమ్రాన్ వేసిన ఓవర్లో చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచిన మిస్బా.. ఆ తర్వాత క్యాడీ వేసిన ఓవర్లో మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మొత్తమ్మీద 37 బంతుల్లో 82 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. 

  • Loading...

More Telugu News