: నేడు తెలంగాణలో వడగళ్ల వానలు.. వాతావరణశాఖ వెల్లడి
తెలంగాణలో నేడు(శుక్రవారం) అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయని, శనివారం కూడా తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర మధ్య కర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు ఆవరించి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో గురువారం కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో సాధారణం కంటే తక్కువగా 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వివరించారు.