: వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన సోనియా గాంధీ!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం ఆమె వెళ్లారని, ఈ నెల 22న తిరిగి స్వదేశం చేరుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఆమె ఏ దేశానికి వెళ్లిందనే విషయాన్ని వారు పేర్కొనలేదు. ఇదిలా ఉంటే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు వెలువడే సమయంలో సోనియా గాంధీ విదేశాల్లోనే ఉంటారు.