: సోనమ్ కపూర్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన తల్లి!


ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా పేరొందిన సోనమ్ కపూర్ తను ధరించే దుస్తులతో పలు మార్లు ఇబ్బందులు పడుతూ, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. సుదీర్ఘ కాలంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సోనమ్ దానిపై ఎప్పుడు ప్రస్తావించినా...మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని సమాధానమిస్తూ తప్పించుకునేది. తాజాగా వీరి వ్యవహారంపై సోనమ్ కపూర్ తల్లి, అనిల్ కపూర్ భార్య సునీత మాట్లాడుతూ, ఈ ఏడాది చివరినాటికి సోనమ్, ఆనంద్ అహూజా ఒక్కటైతే చూడాలని ఉందని తెలిపింది. దీంతో సోనమ్ కు కుటుంబాన్ని ఒప్పించాల్సిన బాధ్యత తప్పింది. అనిల్ కపూర్ ను సునీత ఒప్పించే ఉంటుంది. ఈ నేపథ్యంలో సోనమ్ కపూర్ కు పెళ్లి ఘడియలు ముంచుకొస్తున్నట్టే కనపడుతున్నాయి. కాగా, సోనమ్ ప్రస్తుతం 'సంజయ్ దత్ బయోపిక్' లోనూ, అక్షయ్ కుమార్ తో 'ప్యాడ్ మాన్' సినిమాలోనూ, కరీనా కపూర్ తో 'వీర్ ది వెడ్డింగ్' సినిమాల్లో నటిస్తోంది. 

  • Loading...

More Telugu News